Andhra PradeshEast GodavariNews

వార్డు సభ్యులకు ప్రజాసేవే పరమావధి కావాలి

*వార్డు సభ్యులకు ప్రజాసేవే పరమావధి కావాలి*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* వార్డు సభ్యులు ప్రజాసేవే పరమావధిగా బాధ్యతలు నిర్వర్తించాలని మండపేట ఏఎంసీ చైర్మన్ తేతల వనజా నవీన్ రెడ్డి ,ఎంపీపీ నౌడు వెంకటరమణ పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలోవార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణ తరగతులను ఈ ఓ పి ఆర్ డి బి. అశోక్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. శిక్షణా తరగతులు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఎంసీ చైర్మన్, ఎంపీపీలు మాట్లాడుతూ సభ్యులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, త్రాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం మండలంలోని ఆరు గ్రామాలకు చెందిన వార్డు సభ్యులకు రిసోర్స్ పర్సన్స్ పిఎస్ కృష్ణారెడ్డి, లక్ష్మీ దేవి శిక్షణనిస్తూ సభ్యుల విధులు, బాధ్యతలు, అధికారాలు,సమాజం పట్ల అవగాహన ,సేవాభావం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో వెదురుపాక, వి.సావరం , నదురు బాద,చెల్లూరు, వెంటూరు,కురకాళ్ళపల్లి గ్రామాల నుండి ఎన్నికైన వార్డు సభ్యులు పాల్గొన్నారు

Comment here