Andhra PradeshEast GodavariNews

వాలంటీర్లకు ఘన సత్కారం

వాలంటీర్లకు ఘన సత్కారం
కోస్తా ఎన్ కౌంటర్; అమలాపురం;
అమలాపురం రూరల్‌ మండలం ఇందుపల్లి గ్రామ సచివాలయంలో విశేష సేవలందించిన వాలంటర్లీకు ప్రశంశా పత్రాలు
అందజేసి దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ చొల్లంగి శివాలినీ అప్పాజీ మాట్లాడుతూ ప్రతీ నెలా వృద్ధులకు పెన్సన్‌లు పంపిణీలో వాలంటీర్లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే గ్రామంలో ఎవరికి ఏవిధమైన సమస్యలు ఉన్నా వాలంటర్లు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌, ఉర్రింకి బుజ్జి, ఎంపిటిసి రాంబాబు, నాయకులు మల్లుల పోలయ్య, మల్లుల రామకృష్ణ , వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Comment here