Andhra PradeshEast GodavariNews

విజయవంతంగా మెగా వైద్య శిబిరం

విజయవంతంగా మెగా వైద్య శిబిరం
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి : సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో కీ.శే.మలకల పద్మావతి గారి వర్ధంతి పురస్కరించుకుని శ్రీ మలకల సూర్యారావు ఎం.పి.టి.సి.సభ్యులు ఆధ్వర్యంలో మెగావైద్యశిబిరం నిర్వహించారు.మండల అధ్యక్షులు శ్రీబొబ్బరాడ సత్తబాబు సామర్లకోట జడ్.పి.టి.సి.సభ్యురాలు శ్రీమతి.ఎలిశెట్టి అమృతానరేష్ ప్రారంభించిన ఈశిబిరంలో సూరిబాబు అల్లుడు విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు డా.బి.గౌతమ్ కృష్ణ ,ఎం.డి.జనరల్ ఫిజిషియన్ నేతృత్వంలో రోగులకు వివిద పరీక్షలు నిర్వహించగా   ఆదిత్య ఫార్మశీ కళాశాలల డైరెక్టర్&ప్రిన్సిపాల్.డా.కె.రవిశంకర్ మరియు డా.వై.వి.బి.ప్రసాదరావు (ఎం.పి.టి.సి.సభ్యులు) సౌంజన్యంతో ఈ వైద్య శిబిరంలో 350మందికి పైగా పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందించారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీలపాల సత్యనారాయణ,వైస్ సర్పంచ్ మలకల సత్య , సొసైటీ అధ్యక్షుడు వరాలబాబు,పంచాయితీ మెంబర్ తోటకూర దుర్గాలక్ష్మి,జాతీయ పర్యావరణ మిత్ర అవార్డు గ్రహీత తోటకూర గంగాధర్ ,మలకల సూరిబాబుగారి కుమార్తెలు సత్యవేణి,ఇందిరా ప్రియదర్శిని,సుకృతి,వై.యస్.ఆర్.సి.పి.నాయకులు,కార్యకర్తలు.పాల్గొనగా గ్రామ వైద్యసిబ్బంది,వాలంటీర్లు సహకారం అందించారు.

Comment here