Andhra PradeshEast GodavariNews

విద్యుత్ చార్జీలు మళ్లీమళ్లీ పెంచి పెనుభారం మోపుతున్న ప్రభుత్వం

విద్యుత్ చార్జీలు మళ్లీమళ్లీ పెంచి పెనుభారం మోపుతున్న ప్రభుత్వం

— రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం..
–విద్యుత్ చార్జీలు మళ్లీ పెంచడం దారుణం
— విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ ఎలక్ట్రికల్ ఏఈ కి వినతి పత్రం అందజేసిన సుబ్రహ్మణ్యం

కోస్తా ఎన్ కౌంటర్, రామచంద్రపురం: గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు విద్యుత్ చార్జీలు పెంచరాదని రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం కోరారు. సోమవారం కె.గంగవరం సబ్ స్టేషన్ నందు విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ఎలక్ట్రికల్ ఏఈ పి.వి.వి.సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం అందజేశారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు పెట్టే చర్యలు వెంటనే విరమించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకు చెల్లించాల్సిన 12 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు డిస్కమ్లకు బకాయి ఉన్న 10 వేల 8వందల కోట్ల రూపాయల చెల్లింపులకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థల సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేయాలని వేడుకొన్నారు. అంతేకానీ బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం సరికాదన్నారు.
ఈ కార్యక్రమంలో చింతపల్లి వీరభద్రరావు, మేడిశెట్టి రవికుమార్, సలాది రమేష్, కొత్తపల్లి శ్రీనుబాబు, జొన్నకూటి భాస్కర్రావు, చొల్లంగి ఎదుర్లయ్య, పెంకే సాంబశివరావు, అన్నపూర్ణ , చింతపల్లి అర్జున్, రాయుడు లీలా శంకర్, కోట తాతబ్బాయి, రిస్వంత రాయ్ , దివాకర్, చిగురుపాటి సాయి, వనుం చంటిబాబు , వాసంశెట్టి నాగమణి, కడలి సూర్యకుమారి, జాస్తి విజయలక్ష్మి, మేడిశెట్టి సూర్యనారాయణ, రాయుడు లీలా శంఖర్,కడియాల రాఘవన్ తదితరులు పాల్గొన్నారు.

Comment here