Andhra PradeshEast GodavariNews

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన
ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ మోడీ ప్రభుత్వం నిర్ధాక్షణ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారం విదేశీ కార్పొరేట్ సంస్థలకు అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో బాగంగా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో కోనసీమ  విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి  ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది  సందర్భంగా మోదీ డౌన్ డౌన్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రాణాలైనా అర్పిస్తాం విశాఖ ఉక్కు ను కాపాడుకుంటాం అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి అధ్యక్షులు డి బి లోక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని రాష్ట్రానికి మణిహారంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విదేశీ సంస్థలకు అన్యాయంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని ప్రజలను మభ్యపెట్టి  మోసపూరితమైన విధానాలు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగంలో  నష్టాలు వస్తే ప్రైవేట్ రంగంలో లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ప్రైవేటు సంస్థలకు వేలాది ఎకరాలు తాకట్టు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు ఎందుకు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు . విశాఖ ఉక్కు రక్షించుకునేందుకు  రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించి కేంద్ర ప్రభుత్వమే నడిపించాలని విశాఖ ఉక్కు కర్మాగారానికి భూములిచ్చిన నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమం తీవ్రతరం చేసి విశాఖ ఉక్కు ను కాపాడుకుంటామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జంగాబాబూరావు, కారెం వెంకటేశ్వర రావు రేవు తిరుపతిరావు, P వసంత కుమార్, పెయ్యల శ్రీనివాసరావు, పెయ్యిల  పరశురాముడు, జల్లి శ్రీను, పటాన్ ఇబ్రహీం ఖాన్, ములపర్తి సత్యనారాయణ , తదితరులు పాల్గొన్నారు.

Comment here