Andhra PradeshEast GodavariNews

విశ్రాంత అధ్యాపకులు బాపిరాజు కపిలేశ్వరపురం ఉన్నత పాఠశాలకు రూ.2లక్షలు డిపాజిట్

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కాకినాడకు చెందిన విశ్రాంత అధ్యాపకులు ఉండవల్లి బాపిరాజు శ్రీ సర్వరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.2 లక్షలు డిపాజిట్ చేశారు.డిపాజిట్ చేసిన పత్రాన్ని ఆయన మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముంగర వెంకటరాజుకి అందజేశారు.ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ప్రతియేటా పదవ తరగతిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థులకు అందజేయాలని ఆయన సూచించారు.దాత ఔదర్యాన్ని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నాగేంద్రతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు సి.రామానుజన్ పాల్గొన్నారు.

Comment here