Andhra PradeshEast GodavariNews

వృద్ధులకు ప్రేమానురాగాలు పంచండి

*వృద్ధులకు ప్రేమానురాగాలు పంచండి*

*ఏఎంసీ చైర్మన్ వనజా నవీన్ రెడ్డి*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:**ప్రతివారు వృద్ధుల పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉండాలని మండపేట ఏఎంసీ చైర్మన్ తేతల వనజా నవీన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన రాయవరం లో ఉన్న సంజయ్ గాంధీ వృద్ధాశ్రమంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ చంద్ర మళ్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధి వనజానవీన్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధాప్యం శాపం అనే భావన వారికి కలక్కుండా ప్రతి ఒక్కరూ ప్రేమతో మెలగాలన్నారు. అలాగే ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఏం సి డైరెక్టర్ తేతల సుబ్బరామిరెడ్డి, తాడి రామచంద్రారెడ్డి ,ఎంపీటీసీ గంటి రోజా ,వెలగల ఫణి కృష్ణారెడ్డి ,పడాల కమలా రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వృద్ధులకు ప్రేమానురాగాలు పంచడం విధిగా భావించాలన్నారు. తొలుతగా వృద్ధాశ్రమంలో వృద్ధులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలందజేశారు. కేకును కత్తిరించి, స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ బొడ్డు శ్రీను, వైసీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు పులగం శ్రీనివాసరెడ్డి , ఆశ్రమ నిర్వాహకులు సుందరరాజు, సుధారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

Comment here