Andhra PradeshEast GodavariNews

*వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఎమ్మెల్సీ తోట పూజలు*

*వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఎమ్మెల్సీ తోట పూజలు*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం*: మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని వెదురుపాక విజయదుర్గా పీఠంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు చేయించుకున్నారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం ( గాడ్) ఆశీస్సులు అందుకున్నారు. రాయవరం ఎంపీపీ నౌడు వెంకటరమణ పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. వీరి వెంట వెదురుపాక సర్పంచ్ మల్లిడి సూరారెడ్డి, వైసిపి జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు, ఎంపీటీసీ మండ వెంకట పద్మావతి, వైసీపీ నేత సత్తి పద్దారెడ్డి, వార్డు సభ్యులు, పార్టీ శ్రేణులు ఉన్నారు. అనంతరం వెదురుపాక దేవి సెంటర్ లో కాపు సామాజిక వర్గం నెలకొల్పిన దేవి మండపాన్ని తోట త్రిమూర్తులు కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ వెంట ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఆకుల సుబ్రహ్మణ్యం, సొసైటీ మాజీ అధ్యక్షుడు సత్తి వీర రాఘవ రెడ్డి (వీర వెంకట), ఆకుల సత్యప్రసాద్, తదితరులు ఉన్నారు.

Comment here