Andhra PradeshEast GodavariNews

వైద్య ఆరోగ్య శాఖ అవగాహన సదస్సు

వైద్య ఆరోగ్య శాఖ అవగాహన సదస్సు

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో గర్భస్థ పిండ ఆరోగ్య పరిశీలనకు నిర్దేశించిన పరీక్షలను లింగ నిర్ధారణ కోసం దుర్వినియోగం కాకుండా ఆక్రమాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన తీవ్రచర్యలు తీసుకోబడతాయని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి తెలియజేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆరోగ్య విస్తారణాధికారి రాయుడు, హెల్త్ ఎడ్యుకేటర్ శైలజ ఈ విషయాలను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో రిజిస్టర్ అయిన 276 స్కాన్ సెంటర్లలో  డివిజన్ స్థాయి లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణకు పాల్పడిన  కేసులను నిరూపించినవారికి 50వేలు నగదు ప్రోత్సహo ఇస్తున్నట్లు తెలిపారు. నిర్ధారణ చేస్తున్నవారి వివరాలు తెలిసిన వారు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో 18004243365 టోల్ ప్రీ నెంబర్ కు తెలియచేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ వి.అశోకవర్ధన్, ఆరోగ్య కార్యకర్తలు పవన్,రమణ,ఏ.ఏన్.ఎంలు     శిరోమణి,నాగలక్మి, సూర్యకాంతం,ఆశాలు  పాల్గొన్నారు.

Comment here