Andhra PradeshEast GodavariNews

వైయస్సార్ ఆసరాను సద్వినియోగం చేసుకోండి

*వైయస్సార్ ఆసరాను సద్వినియోగం చేసుకోండి*

*సోమేశ్వరం సర్పంచ్ ఆరీఫ్*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం*
‌‌‍ వైయస్సార్ ఆసరా పథకాన్ని స్వయం సహాయక సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని సోమేశ్వరం సర్పంచ్ ఆరిఫ్ అన్నారు. బుధవారం గ్రామంలో వెలుగు సిసి ఈ. దేవుడు ఆధ్వర్యంలో జరిగిన స్వయం సహాయక సంఘాల సమావేశానికి సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మల ఖాతాలకు ఈ నెల 8 న గ్రామంలో ఉన్న 198 స్వయం సహాయక సంఘాలకు ,రెండవ విడతగా సుమారు 2 కోట్ల 06 లక్షల77 వేల 503 రూపాయలు జమ చేయనున్నారు. ఈ సొమ్మును సద్వినియోగం చేసుకొని, సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మహిళా సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శాఖ ఆదినారాయణ ( బుజ్జి,) వైస్ ఎంపీపీ గుమ్మడి చంద్రశేఖర్ , ఎంపీటీసీ అప్పన్నబాబు , సొసైటీ చైర్మన్ నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ధూళిపూడి వెంకటేశ్వర్రావు, గ్రామ పెద్దలు ,వార్డుమెంబర్లు ,యానిమేటర్లు,వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comment here