Andhra PradeshEast GodavariNews

వైయస్సార్ పార్టీ పై ప్రజాభిమానానికి ఎన్నడూ రుణపడి ఉంటాం:ఎంపీపీ 

వైయస్సార్ పార్టీ పై ప్రజాభిమానానికి ఎన్నడూ రుణపడి ఉంటాం:ఎంపీపీ
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి : వైయస్సార్ పార్టీ పై ప్రజల చూపెడుతున్న ఆదరాభిమానాలకు ఎన్నడూ రుణపడి ఉంటామని గండేపల్లి ఎంపీపీ చలగళ్ళ దొరబాబు, వైస్ ఎంపీపీ కుంచే రాజా, జెడ్పిటిసి సభ్యురాలు పరిమి వెంకటలక్ష్మీ మంగతాయారు బాబు అన్నారు. శుక్రవారం గండేపల్లి మండలం లోని ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యుల  విజయోత్సవ ర్యాలీ గండేపల్లి, రామయ్య పాలెం, సింగరం పాలెం, కే.గోపాలపురం, ఎన్టీ రాజాపురం గ్రామాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కె.గోపాలపురం లో జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అవసరాల పార్థసారథి ఆధ్వర్యంలో ఎంపీపీ చలగళ్ళ దొరబాబు, వైస్ ఎంపీపీ కుంచే రాజా, జెడ్పిటిసి సభ్యురాలు పరిమి వెంకటలక్ష్మీ మంగతాయారు బాబు, ఎంపీటీసీ లను పూలమాలలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో గండేపల్లి మండలం లోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి గ్రామాన్ని పర్యటించి గ్రామంలో సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తామన్నారు. అర్హులకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించి ఆదుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు ఓటు తో వైఎస్ఆర్ పార్టీపై చూపెడుతున్న ఆదరాభిమానాలను ఎన్నడూ మరువలేమన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కందుల చిట్టిబాబు,పోసిన బాబురావు, జాస్తి వసంత్, దొమ్మా శ్రీను, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Comment here