Andhra PradeshEast GodavariNews

‘వైస్సార్ పెన్షన్ల పంపిణి ‘

కోస్త ఎన్ కౌంటర్, ,రాజమహేంద్రవరం సిటీ; రాజమండ్రి రూరల్ స్థానిక 27వ వార్డు సచివాలయంలో వైస్సార్సీపీ నాయకులు బిల్డర్ చిన్నా  ఆధ్వర్యంలో ఈ రోజు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీ చందన నాగేశ్వర్  నూతనంగా విడుదల చేసిన పెన్షన్లు ‘వైస్సార్ పెన్షన్ కానుక’ ను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ చందన నాగేశ్వర్  మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగంగా ఈ ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ ను లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసిచందన నాగేశ్వర్ గారు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి ఈ వైయస్సార్ పెన్షన్ కానుక అందిస్తున్నారని తెలిపారూ. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన వారు ఎవరైనా ఉంటే తమ పరిధిలోగల సచివాలయాల్లో నూతన పెన్షన్లను కొరకు దరఖాస్తు చేసుకోవాలని చందన నాగేశ్వర్  తెలియజేసి, అనంతరం నూతన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయుకులు కొప్పినీడి ప్రసాద్, సబ్బేళ్ల విజయ్, గేదే అన్నపూర్ణ రాజు, వుళ్ళురి రాజు, కనక లింగేశ్వర , వంశీ, సత్తిరాజు, యర్రన్న,  భాస్కరరావు, మాచవరం రెడ్డి  మరియు వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు….

Comment here