Andhra PradeshEast GodavariNews

*వైస్సార్ యాంత్రా సేవ*

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం కడియపూసవరం గ్రామంలో నిర్వహించిన *వైస్సార్ యాంత్రా సేవ* కార్యక్రమనికి ముఖ్యఅతిధిలుగా రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ & రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ ,  తూ”గో జిల్లా డీసీసీబీ ఛైర్మన్  ఆకుల వీర్రాజు  పాల్గొన్నారు..
కడియం మండలం కడియపూసవరం గ్రామంలో వ్యవసాయశాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన *వైస్సార్ యాంత్రా సేవ* కార్యక్రమంలో  జై శ్రీరామ్ సి.హ్.సి  గ్రూప్ కు వ్యవసాయ పనిముట్లును పవర్ టిల్లర్స్-3, పవర్ స్ప్రయర్-1, బాక్టీరియా స్ప్రయర్-4 రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ గారు మరియు డీసీసీబీ ఛైర్మన్ ఆకుల వీర్రాజు  అందించారు.
 అనంతరం చందన నాగేశ్వర్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతుల ఆర్థిక స్థితిని మెరుగు పరిచే దిశగా పలు విభిన్న పథకాలను రూపొందిస్తూ అమలు చేస్తూ రైతులకు లబ్దిచేకూరుస్తుంది అని,
తాజాగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం “వైఎస్సార్ యంత్రసేవ” పధకాన్ని ప్రారంభించి అమలు చేస్తోందని  తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండలి వ్యవసాయ సలహా చైర్మన్ యిలి గోపాలం, కడియపులంక సొసైటీ చైర్మన్ తిరుమలశెట్టి వెంకటేశ్వరరావు,మాజీ సర్పంచ్ సాపిరెడ్డి సూరిబాబు, సాపిరెడ్డి కామేష్, దుళ్ల సర్పంచ్ కొండపల్లి పట్టియ్య,తాడాల చక్రవర్తి, సంగీత వెంకటేశ్వర్లు మరియు బ్యాంక్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు….

Comment here