Andhra PradeshEast GodavariNews

వ్యవసాయ సలహా మండలి లో రైతులు సమస్యలు చెప్పుకోవచ్చు.

వ్యవసాయ సలహా మండలి లో రైతులు సమస్యలు చెప్పుకోవచ్చు.

కోస్తా ఎన్ కౌంటర్ టి నరసాపురం. పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం టి నర్సాపురం మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ సలహా మండలి కార్యక్రమం ఎంపీపీ దార బోయిన లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి సభ్యులు సామంతపూడి బాల సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో కూడా గ్రామ సంఘం తీర్మానం చేసిన విషయాలు మండల స్థాయి లో చర్చించి అవి అమలయ్యే విధంగా గా అధికారులు కృషి చేయాలని ఆయన తెలిపారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులకు ఏదైనా సమస్య ఉంటే మండల సలహామండలి సమావేశంలో చెప్పాలని సమస్యను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గవరం సొసైటీ అధ్యక్షులు వాసిరెడ్డి మధు,  టీ నర్సాపురం సొసైటీ అధ్యక్షులు ముత్తయ్య, మక్కినవారిగూడెం సొసైటీ అధ్యక్షులు పి చక్రవర్తి ,ఎంపీటీసీ సభ్యులు బండి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Comment here