Andhra PradeshEast GodavariNews

వ్యవసాయ సలహా మండలి సమావేశం 

వ్యవసాయ సలహా మండలి సమావేశం
కోస్తా ఎన్ కౌంటర్, కడియం;
కడియం మండలం కడియం అగ్రికల్చర్ ఆఫీస్ నందు వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు ఈలీ గోపాలం సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి కళ్యాణ్ హార్టికల్చర్ అధికారి డి సుధీర్ కుమార్ పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కే సత్యనారాయణ  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఏవో కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు అక్టోబర్ 15వ తారీఖు వరకు పంట భీమ రైతు భరోసా వంటి సంక్షేమ పథకాల కు వేలిముద్ర నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వచ్చే నవంబర్ నెల నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు నుండి ధాన్యం సేకరణ గురించి దాని యొక్క విధి విధానాలను ఈ సమావేశంలో రైతులకు తెలియజేయడం జరిగింది.  ఆర్ బి కే ద్వారా పశుసంవర్ధక శాఖ నుంచి వస్తున్న పథకాలు గాను గాలికుంటు వ్యాధి కొరకు టీకాలు వేయడం తదితర అంశాలను డాక్టర్ కె సత్యనారాయణ రైతులకు వివరించారు. హార్టికల్చర్ అధికారి  సుధీర్ కుమార్ మాట్లాడుతూ జీవవైవిద్య సేంద్రియ  ఎరువుల కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తద్వారా అధిక ఉత్పత్తులు వ్యవసాయ రంగంలో సాధించవచ్చని ఆయన అన్నారు. రానున్న దాల్వా సీజన్ కు కడయం  మండలంలో అవసరమైన యూరియా ,డిఎపి, పొటాషియం వంటి అన్ని రకాల ఎరువులు మందులను  ముందస్తుగా తగిన ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ కమిటీ అధ్యక్షుడు ఈలి గోపాలం అన్నారు  కాకినాడ లో జరగబోయే జిల్లా మీటింగ్ లో జెసి దృష్టికి తీసుకెళ్లి మండలానికి అవసరమైన అన్ని రకాల ఎరువులను రైతులకు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గోపాలం అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వ్యవసాయ కమిటీ సభ్యులు రైతులు , ప్రభుత్వ అధికార తదితరులు పాల్గొన్నారు

Comment here