Andhra PradeshEast GodavariNews

– శ్రీదేవీ శరన్నవరాత్రి మహెూత్సవాలను వైభవోపేతంగా నిర్వహించండి 

– శ్రీదేవీ శరన్నవరాత్రి మహెూత్సవాలను వైభవోపేతంగా నిర్వహించండి
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
– శేష వస్త్రాలతో ఆలయ ధర్మకర్తల ఘన సత్కారం
– ఆశీర్వచనం అందజేసిన వేద పండితులు
గుడివాడ, అక్టోబర్ 6: దసరా పండుగను పురస్కరించుకుని శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సూచించారు. బుధవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని శ్రీకొండాలమ్మ దేవస్థానం చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముగం, మండల ప్రముఖుడు అల్లూరి ఆంజనేయులు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానికి శ్రీకొండాలమ్మ దేవస్థానంలో నిర్వహించే నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి, మహెూత్సవాలను ప్రారంభించాలని ఆహ్వానించారు. అమ్మవారి తీర్ధప్రసాదాలను అందజేశారు. అలాగే గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డులోని శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పట్టపు వేణుగోపాలరావు, కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు తదితరులు మంత్రి కొడాలి నానిని కలిశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు. మంత్రి కొడాలి నానిని స్వామివారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. మహెూత్సవాలకు రావాలంటూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ తుమ్మలపల్లి వెంకట సత్యనారాయణ, ధర్మకర్తలు అగస్త్యరాజు కృష్ణమోహనరావు, వంగపండు బ్రహ్మేశ్వరరావు, మీగడ మహేశ్వరి, లక్కోజు శివప్రసాద్, బెజవాడ విజయరాణి, పువ్వుల అహల్య సూర్యకుమారి, నూకల లక్ష్మీ శివజ్యోతి, ఎక్అఫీషియో మెంబర్ లంక విజయ సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణం కాకర్లవీధిలోని శ్రీవేణుగోపాల స్వామి దేవస్థానంలో జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు రావాలంటూ ఆలయ చైర్మన్ దుడ్డు చిన్నా, కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాసరావులు మంత్రి కొడాలి నానిని ఆహ్వానించారు. శేషవస్త్రాలతో సత్కరించిన అనంతరం మంత్రి కొడాలి నానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పెద్దిబోయిన వెంకటేశ్వరరావు, నిల్లా పద్మ, దాసరి కనకదుర్గా పార్వతి, కోటే వెంకటేశ్వరమ్మ, రాలి పార్వతి, ఎక్స్అఫీషియో మెంబర్ నల్లపాటి శ్రీనివాస దాశరథి తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణం గౌరీశంకరపురంలోని శ్రీగౌరీశంకర స్వామి దేవస్థానంలో జరిగే నవరాత్రి మహోత్సవాలకు రావాలంటూ మంత్రి కొడాలి నానికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానిని శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ డాక్టర్ బండారు శ్యామ్ కుమార్, ధర్మకర్తలు మూడెడ్ల ఉమా, రావులకొల్లు హైమావతి, కొండపల్లి వెంకట నారాయణరెడ్డి, వీ బాలకృష్ణమూర్తి, వసంతవాడ వీరమ్మ, మోట్రు కోటేశ్వరమ్మ, ఎక్స్అఫీషియో మెంబర్ కుందుర్తి వీరవెంకట సుబ్రహ్మణ్య శర్మ, అర్చకులు లంక గిరిచంద్ర తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణం నీలామహల్ రోడ్డులోని శ్రీవిజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో జరిగే నవరాత్రి మహెూత్సవాలకు రావాలంటూ ఆలయ చైర్మన్ నైనవరపు శేషుబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి చలసాని శేషగిరిరావులు మంత్రి కొడాలి నానిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానికి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.

Comment here