Andhra PradeshEast GodavariNews

శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయంలో చండీ హోమం

శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయంలో చండీ హోమం
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి : దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గండేపల్లి శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయంలో సోమవారం ఆలయ ఈవో  సి హెచ్ ఎస్ ఎన్ శ్రీనివాస్ అధ్యక్షతన శ్రీ లక్ష్మీ గణపతి హోమం, రుద్ర హోమం, నవగ్రహ శాంతి హోమం, మహా మృత్యుంజయ హోమం, చండీ హోమం నిర్వహించారు. ఆలయ పురోహితులు చేబ్రోలు సుందరరామయ్య,  దేవళ్ళ మణికంఠ ల ఆధ్వర్యంలో చండీ హోమం  జరిపించారు. వైయస్సార్ సిపి నాయకులు  బోదా రామిరెడ్డి దంపతులు, కొప్పుల వీరన్న రెడ్డి దంపతులు పీటల పై కూర్చుని భక్తిశ్రద్ధలతో ఈ హోమాన్ని జరిపించారు. గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఈ  కార్యక్రమాన్ని  జరిపించాం అన్నారు. ఈ కార్యక్రమంలో  తొండాపు జానకి రామారెడ్డి, గోగు సూరిబాబు, సుంకవల్లి ఎల్లయ్య చౌదరి, చాగంటి కృష్ణమోహన్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Comment here