Andhra PradeshEast GodavariNews

*సరస్వతి దేవి అలంకారంలో విజయ దుర్గ అమ్మవారు*

*సరస్వతి దేవి అలంకారంలో విజయ దుర్గ అమ్మవారు*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో దేవి శరన్నవ రాత్రుల్లోభాగంగా ఆరవ రోజు మంగళవారం విజయ దుర్గ అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పీఠబ్రహ్మ చీమల కొండ శ్రీనివాస్ అవధాని ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు ,అర్చనలు, అష్టోత్తర సహస్ర నామాలతో కుంకుమ పూజలు నిర్వహించారు. పీఠాధిపతి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ సరస్వతి అవతారంలో ఉన్న అమ్మవారిని అర్చిస్తే విద్యావంతులు అవుతారని, జ్ఞానం సిద్ధిస్తుందని ఉద్బోధించారు. సరస్వతి పూజ చేయించుకున్న విద్యార్థినీ విద్యార్థులకు పెన్నులు, అమ్మవారి చిత్రపటం, కుంకుమ ప్రసాదమందజేశారు. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వి వి బాపిరాజు , విజయ దుర్గ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పి ఆర్ ఓ వాడ్రేవు వేణుగోపాల్ ( బాబి) ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ గావించారు

Comment here