Andhra PradeshEast GodavariNews

సర్పంచ్ ల సమాఖ్య అధ్యక్షుడిగా టిల్లపూడి నాగేశ్వరరావు

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజవర్గ తాళ్లరేవు మండలం సర్పంచ్ ల సమాఖ్య అధ్యక్షుడిగా సుంకరపాలెం సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం కోరంగి సొసైటీ భవనంలో ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడిని ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్ లు ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ల సమస్యల పరిష్కారానికి అందరిని కలుపుకుని పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సాఆర్ సిపి మండల అధ్యక్ష కార్యదర్శులు కాదా గోవిందకుమార్,డాక్టర్ రాయుడు గంగాధర్ పాల్గొనగా నూతనంగా ఎంపికైన నాగేశ్వరరావును జెడ్పిటిసి దొమ్మేటి శ్యాముల్ సాగర్, సర్పంచ్ లు మరియు నాయకులు అభినందించారు.

Comment here