Andhra PradeshEast GodavariNews

సామాజిక స్థలం కబ్జాకు ముమ్మర ప్రయత్నాలు

“కోట్ల విలువైన కాపు సామాజిక స్థలం కబ్జాకు ముమ్మర ప్రయత్నాలు”.
“3 కోట్ల ఆస్తిపై కన్ను – దాత ఆశయానికి తూట్లు”.  .
కోస్తా ఎన్ కౌంటర్, కడియం:  కడియం … మండలంలోని కడియపులంక గ్రామ పంచాయతీ పరిధి దోసాలమ్మ కాలనీ సమీపంలో అత్యంత ఖరీదైన కాపుసామాజిక స్థలం కబ్జా చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయి. కాలనీ వద్ద  ఎ 0.80 సెంట్ల భూమి ని కాపు కళ్యాణమంటపం నిర్మాణానికి వినియోగించాలని, వివాహాది శుభకార్యాలకు ఉచితంగా ఇవ్వాలని కడియపులంక గ్రామానికి చెందిన దాత అన్నందేవుల సీతామహాలక్ష్మీ (బాస్కరం) ఉన్నత ఆశయంతో ముందుకొచ్చారు. ఈ మేరకు 3 ఏళ్ల క్రిందటే విలువైన భూమిని గ్రామ పంచాయతీకి రిజిస్టర్ చేయించారు. గత ప్రభుత్వ హయాంలో కల్యాణమండపం నిర్మాణానికి భూమిపూజ కూడా చేసారు. రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సర్వే నెం. తప్పుగా నమోదుకాబడింది. ఆ లొసుగును ఆసరాగా చేసుకుని స్థలాన్ని కొట్టేయడానికి కబ్జాదారులు ప్రయత్నిస్తున్నట్లు పలువురు పెద్దలు ఆరోపిస్తున్నారు. దీనిపై గ్రామపెద్దలు , కాపునాయకులు , పంచాయతీ అధికారులు మేల్కొని విలువైన సామాజిక స్థలం కబ్జాకు గురికాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Comment here