Andhra PradeshEast GodavariNews

సారాయి పై ఉక్కుపాదం 

సారాయి పై ఉక్కుపాదం
*జగ్గంపేట సిఐ సురేష్ బాబు
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి : సారాయి తయారీదారులు అమ్మేవారు పై ఇకపై ఆటలు సాగవని జల్లెడ పట్టి వారి ఆటలు కట్టిస్తామని జగ్గంపేట సి ఐ సురేష్ బాబు హెచ్చరించారు.బుధవారం గండేపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
జిల్లా ఎస్పీ రవీంద్రనాద్ బాబు మరియు జాయింట్ డైరెక్టర్ రమాదేవి గారి  ఆదేశాల మేరకు గండేపల్లి మండలం మురారి గ్రామంలో ఎన్ ఫోర్స్ మెంట్  మరియు తమ సిబ్బంది సుమారు నలభై మంది కలిసి గ్రామాన్ని చుట్టుముట్టి నలుగురు మనుషులను 120 సారాయి పట్టుకోవడం జరిగింది. గ్రామ పొలిమేర ప్రాంతాల్లో 5,200 లీటర్ల బెల్లపు ఊట ను ధ్వంసం చేయడం జరిగిందన్నారు.ఇకపై తరచూ  సారాయి కేసులో దొరికిన వారి పై పీడీ యాక్ట్ కేసు పెట్టి  వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో  ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ జి వెంకట లక్ష్మి  , ఎస్ ఐ నాగేంద్ర కృష్ణ  గండేపల్లి ఎస్ ఐ పి  శోభన్ కుమార్, కిర్లంపూడి ఎస్సై అప్పలరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Comment here