Andhra PradeshEast GodavariNews

సారా తయారీ బట్టిల పై రాష్ట్ర వ్యాప్త స్పెషల్ డ్రైవ్

కోస్తా ఎన్ కౌంటర్, ముమ్మిడివరం;  ముమ్మిడివరం నియోజకవర్గ తాళ్ళరేవు మండలం లో గురువారం సారా తయారీ బట్టిల పై రాష్ట్ర వ్యాప్త స్పెషల్ డ్రైవ్ లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎమ్. రవీంద్రనాథ్ బాబు ఐ పి ఎస్ కి వచ్చినసమాచారం మేరకు అడిషనల్ ఎస్పీ వారి పర్యవేక్షణ లో తాళ్లరేవు మండల పరిధిలో గల స్థానిక మడ అడవులో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో సుమారుగా వేరువేరు ప్రదేశాలలో 16,000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను నింపి ఉన్న డ్రమ్ములను ధ్వoసం చేయడం జరిగిందని మరియు 350 లీటర్ల సారాయి ని స్వాధీనం చేసుకోవడమే కాక, ఒక బోట్ ను కూడా సీజ్ చేయడం జరిగింది.ఈ దాడులలో టి. గణేష్, ఇన్స్పెక్టర్ ఎస్.ఇ.బి మరియు ఇంటెలిజెన్స్ టీం మరియు కోరంగి పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Comment here