Andhra PradeshEast GodavariNews

సినీ పరిశ్రమ ఎవరి సొత్తు కాదు

సినీ పరిశ్రమ ఎవరి సొత్తు కాదు
` ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ
విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ…..
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : సినీ పరిశ్రమ ఎవరి సొత్తు కాదని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక తన కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో అవినీతిని అరికట్టేందుకు ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు. దీనికి చిరంజీవి సైతం పూర్తి మద్దతునిస్తానని తెలిపారన్నారు. ఆయనకున్న హుందాతనం మీకు ఉందా అని ప్రశ్నించారు. తాలిబన్‌ పంథా పరిపాలన జనసేన కోరుకుంటుందన్నారు. జీఎస్టీ విధానంపై ప్రధానిని ప్రశ్నించి తర్వాత తమ ప్రభుత్వం పనితీరును నిలదీయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన అక్రమ పొత్తు, దానిపై జనసేన సమాధానం చెప్పగలదా అన్నారు. కాపు అంటే నమ్మకానికి ప్రతిరూపం అని, కాపులకు మచ్చ తెచ్చే పార్టీ జనసేన అని విమర్శించారు. కాపులంటే జనసేన ఒక్కరికీ పరిమితమా ? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు గుండుబోగుల నాగు, కర్రి భాస్కరరావు, గుండుమోగుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Comment here