Andhra PradeshEast GodavariNews

*సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి*

*సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి*

*రాయవరం సర్పంచ్ రామకృష్ణ*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం*: సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు తమ వంతు కృషి చేయాలని మండల కేంద్రమైన రాయవరం సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం గ్రామంలో రెండు డెంగ్యూ కేసులు బయటపడడంతో గ్రామపంచాయతీ మెరుగైన పారిశుధ్యానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా దోమల నివారణా మందు పిచికారీ చేయడంతోపాటు, డ్రైన్లు శుభ్రం చేసి, వీధుల్లో బ్లీచింగ్ చల్లారు. పరిసరాల్లో పిచ్చిమొక్కలు తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత విధిగా పాటించాలని కోరారు. గ్రామంలో ఎక్కడా అపారిశుద్ధ్యం లేకుండా చర్యలు చేపట్టా మన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Comment here