Andhra PradeshEast GodavariNews

హాస్టల్ లో విద్యార్థులకు బ్రైట్ స్వచ్చంద సేవ సంస్థ పలు సేవలు

హాస్టల్ లో విద్యార్థులకు బ్రైట్ స్వచ్చంద సేవ సంస్థ పలు సేవలు,

స్వర్గీయ మందపల్లి మార్తమ్మ రిటైర్డ్ టీచర్ జ్ఞాపకార్థం

నోటు పుస్తకాలు,పెన్నులు పంపిణీ -సంస్థ
సెక్రెటరీ టి. జయశ్రీ

అనకాపల్లి టౌన్, కోస్త ఎన్ ఎన్కౌంటర్ :

అనకాపల్లి స్థానిక పట్టణం శ్రీరామ్ నగర్ నందు గల అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ లో బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్వర్గీయ మందపల్లి మార్తమ్మ రిటైర్డ్ టీచర్ జ్ఞాపకార్థం ఆమె కుమారుడు, మనవడు ఆర్థిక సహాయంతో సంస్థ ప్రతినిధులు నోటు పుస్తకాలను పెన్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి తాతపూడి జయశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్స్లో చదువుకుంటున్న విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడి ఉంటారని ఇటువంటి విద్యార్థులకు మా సంస్థ ఎల్లవేళలా సహాయపడుతుందని ఇప్పటికే మేము ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్స్లో అనేక కార్యక్రమాలు చేపట్టామని భవిష్యత్తులో కూడా ఇటువంటి పేద విద్యార్థుల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు. ఈ హాస్టల్ నిర్వాహకులు తమ విద్యార్థులు నోటు పుస్తకాలు,పెన్నులు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారని ఈ సహాయం మీరు చేయాలని అడిగిన వెంటనే మా సంస్థ స్పందించి ఈ విద్యార్థులకు నోటు పుస్తకాలను, పెన్నులను అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా ఆమె ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన మందపల్లి మార్తమ్మ వారి కుటుంభానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మరిన్ని కార్యక్రమాలు చేయడానికి దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని మమ్ములను నేరుగా ఫోన్ ధ్యారా సంప్రదించవచ్చును అని 81427 80888 ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బ్రైట్ స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కళ్ళ శివశంకర్ , సంస్థ ప్రతినిధులు ప్రదీప్ కుమార్, పి.వి కిరణ్మయి, కె రమేష్ బాబు, హాస్టల్ నిర్వాహకులు యమునా వీరమ్మ, ధవలేశ్వరి, స్థానిక ప్రజలు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Comment here