Andhra PradeshEast GodavariNews

హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం

హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం
… ఎన్ఆర్ఈజీఎస్ పనులపై 12 శాతం వడ్డీతో సొమ్ములు చెల్లింపులు
…. మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి వెల్లడి
కోస్తా ఎన్ కౌంటర్ ,సర్పవరం: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో లో గ్రామీణ అభివృద్ధి లో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్ భాగస్వామ్యంతో రోడ్లు డ్రైన్లు నిర్మాణాలు చేపడితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పనులకు సంబంధించిన బిల్లులను నిలుపుదల చేసి కాంట్రాక్టర్ లను ఇబ్బందులకు గురి చేయడం పట్ల హైకోర్టులో వేసిన పిటిషన్లకు న్యాయం చేకూరుతుంది తీర్పు ఇవ్వడం పట్ల కాకినాడ రూరల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లు నిలుపుదల చేసి అనేకమందికి కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై 1013 మంది హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేయడం పట్ల ముందుగా 20 శాతం పనులకు సంబంధించిన సొమ్మును నిలుపుదల చేసి ఇ మిగతా సొమ్మును చెల్లించాలని తీర్పు చెప్పడం జరిగిందన్నారు. దీనిపై ప్రభుత్వం పనులను టిడిపి కార్యకర్తలు సరిగా చేయలేదంటూ పనులపై క్వాలిటీ కంట్రోల్ బోర్డులతో పరీక్షలు నిర్వహించిన తర్వాత సొమ్మును చెల్లించడం జరుగుతుంది అని చెప్పడంతో కొంత కాలం జాప్యం జరిగిందన్నారు. ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం బిల్లుపై జాప్యం చేసే విధంగా రాజకీయాలు చేయడం జరిగిందన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం పట్టించుకోకుండా క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నామంటూ తప్పించుకోవడం జరిగిందన్నారు. దీనిపై పిటిషనర్లు తిరిగి మళ్ళీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆశ్రయించగా 2014 నుండి డి 2019 వరకు ఎన్ఆర్ఈజీఎస్ పనుల నిమిత్తం ఎంత బిల్లులు చేస్తే వారందరికీ 12 శాతం వడ్డీతో తిరిగి నాలుగైదు వారాల లోపు సొమ్మును చెల్లించాలని తీర్పులు వెల్లడించడం జరిగిందన్నారు. తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 70 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, నాణ్యతతో రోడ్లను వేయడం జరిగిందని వాటన్నిటిని అధికారులు పరిశీలించి సర్టిఫై చేయడం కూడా జరిగిందన్నారు. కాంట్రాక్టర్లు అందరూ వారివారి బిల్లులను చేసుకుని సొమ్మును పొందవలసిందిగా కోరారు.

Comment here