Andhra PradeshEast GodavariNews

10న ఉచిత గుండె పరీక్షా శిబిరం

10న ఉచిత గుండె పరీక్షా శిబిరం
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : మండలంలోని ప్రత్తిపాడు 3ఎఫ్‌ పరిశ్రమలో ఈ నెల 10వ తేదిన చిన్నపిల్లల గుండె పరీక్షా శిబిరం నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 12 ఏళ్ళ లోపు చిన్నారులకు 2డి ఎకో పరీక్షలు ఉచితంగా చేయబడునని, తాడేపల్లిగూడెం పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ముందుగా బాధిత చిన్నారుల తల్లిదండ్రులు 9951824777, 9505911883 నెంబర్లకు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. హైదరాబాద్‌కు చెందిన స్టార్‌ ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ సుమన్‌ వైద్య పరీక్షలు చేస్తారన్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి 3ఎఫ్‌ సంస్థ అవసరమైన ఖర్చు, ప్రయాణ ఖర్చులను భరిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Comment here