Andhra PradeshEast GodavariNews

బాలయోగి 70వ జయంతి కార్యక్రమంలో ఆదిరెడ్డి

బాలయోగి గారి 70వ జయంతి కార్యక్రమంలో ఆదిరెడ్డి
కోస్త ఎన్ కౌంటర్, రాజమహేంద్రవరం సిటీ :
మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అమలాపురంలోని జిఎంసీ బాలయోగి ఘాట్లో టీడీపీ అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ ఆధ్వర్యంలో జరిగిన బాలయోగి 70వ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి దేశంలోని రాజకీయ నాయకులందరికీ రోల్ మోడల్ అని అన్నారు. రాజకీయాల్లో నిబద్ధత మరియు చిత్తశుద్ధి కారణంగా జిల్లాలోని పేద కుటుంబానికి చెందిన బాలయోగి లోక్సభ స్పీకర్గా ఎదిగారని కొనియాడారు. ఆయన ఆలోచనలతో తూర్పు గోదావరి జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, ఆయన మృతి చెందే వరకూ సాధారణ జీవితం గడిపారని అన్నారు. అటువంటి మహా మనిషి ఈ రోజున మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.

Comment here