Andhra PradeshEast GodavariNews

Text Message

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:అంగర సంత మార్కెట్ సమీపములో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం గ్రామ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఇందిరాగాంధీ తన శక్తి సామర్ధ్యాలతో దేశాన్ని పరిపాలించి ఖ్యాతి గడించారన్నారు.  గ్రామానికి చెందిన సంకాబత్తుల సీతారామయ్య కుమారుడు ఎర్ర అబ్బులు ఇందిరా గాంధీ విగ్రహానికి రూ.23 వేలు వెచ్చించి  ఏర్పాటు చేయడం  స్ఫూర్తిదాయకమని  కోటేశ్వరరావు పేర్కొన్నారు. గతంలో ఆమె విగ్రహాన్ని పాఠశాల ప్రాంగణంలో  ఏర్పాటు చేయగా,ఆ విగ్రహం శిధిలం కావడంతో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎర్ర అబ్బులు పేర్కొన్నారు.విగ్రహ దాత ఎర్ర  అబ్బులును పలువురు అభినందించారు.కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ తోరం రాము,మాజీ సర్పంచ్ సంకాబత్తుల స్వామికాపు,బిజెపి ఓబిసి జిల్లా ఉపాధ్యక్షులు సూరంపూడి సత్యనారాయణ,నంబుల వెంకన్న,పాఠశాల ప్రధానోపాధ్యాయులు బంటుమిల్లి వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Comment here