Andhra PradeshEast GodavariInternationalNationalNews

మీడియా ముసుగుతొ పొలిటికల్ దందా

మీడియా ముసుగుతో..పొలిటికల్‌ దందా!
`రాజమండ్రిలో.. అధికార పార్టీ నాయకుడి మామూళ్ల పర్వం
`టౌన్‌ ప్లానింగ్‌ అధికారుతో మిలాఖాత్‌
`గవర్నర్‌కు ఫిర్యాదు చేసామని బెదిరింపు
`ఓ రెస్టారెంట్‌కు సీల్‌ వేసిన టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి రాజా
`టిడిపి నాయకుడి పత్రిక ప్రతినిధి పేరుతో బ్లాక్‌మెయిలింగ్‌
`రూ.రెండు క్షు డిమాండ్‌..సొమ్ములిస్తేనే సీల్‌ తెరిపిస్తామని స్పష్టీకరణ
`దానవాయిపేట,ప్రకాశం నగర్‌, గాంధీపురం ప్రాంతాలే అడ్డా
`వ్యాపాయి,వ్యాపార సంస్థలే..ఆదాయ వనయి
రాజకీయం..అధికారం..మీడియా..మిలాఖాత్‌ అయితే ఎలా ఉంటుందంటే..ఒక సామాన్యుడి బతుకు రోడ్డు మీదకు వచ్చేస్తుంది. వడ్డీకు తెచ్చుకున్న సొమ్ము.. వ్యాపారంగా మారకుండానే అప్పు ఊబిలో కూరుకుపోతాడా చిరు వ్యాపారి. రాజమండ్రిలో ఓ అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో.. మీడియా ముసుగులో… సాగుతున్న దందాకు ఓ సామాన్య వ్యాపారస్తుడు బలి పశువుగా మారాడు. దీనికి టౌన్‌ప్లానింగ్‌లో ఓ అవినీతి రాజా..సంపూర్ణ సహకారం అందించడం సిగ్గుచేటు. దీనిపై కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం. (జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి,రాజమహేంద్రవరంÑ
ప్రశాంతమైన గోదావరి తీరంలోని రాజమహేంద్రవరం.. ఉభయ గోదావరి జిల్లాకు కీక నగరం. వ్యాపార,వాణిజ్యాకు నెవు. అలాగే..ఇక్కడ ఖద్దరు మాటున ఘరానా మోసాు.. అధికార దర్పంతో..దర్జా దందాు చాపకింద నీరులా సాగిపోతూనే ఉంటాయి. ఈ దందాకు..మీడియా జత కలిస్తే నోట్ల కట్ట వర్షమే. రాజకీయం మాటున.. ప్రజను దోచుకుతినే రాబందు ఒక ఎత్తైతే.. అధికారంతో అవినీతిని నరనరాన నింపుకున్న మామూళ్ల మా‘రాజు’ు మరో ఎత్తు. ఈ ఇద్దరితో..మీడియా మాయగాళ్లు చేయి కలిపి.. సామాన్య,మధ్యతరగతి వర్గాకు చెందిన వారిని దోచుకు తింటున్నారనడానికి ఈ ఎపిసోడ్‌ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.దీనిపై..కోస్తా ఎన్‌కౌంటర్‌ ఒక చిన్న స్ట్రింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తే.. మూడు రంగాకు చెందిన కలెక్షన్‌ కింగ్‌ అసు స్వరూపం.. ఆడియో టేపు సాక్షిగా బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే..రాజమండ్రి నగరంలో దానవాయిపేట, ప్రకాశం నగర్‌, గాంధీపురం ప్రాంతాు ఆర్థికంగా బంగా ఉన్న ప్రాంతాు. ఖరీదైన ప్రదేశాు. దీనికి కారణం.. ఈ మూడు ప్రాంతాు కార్పోరేట్‌ ఆసుపత్రు, దిగ్గజ కార్పోరేట్‌ కంపెనీ భారీ వ్యాపార సముదాయాకు కేంద్రంగా ఉండటమే. అంతేకాదు.. హోటళ్లు, రెస్టారెంట్లు మొదుకుని.. వివిధ రకా భారీ.చిన్న తరహ వ్యాపారాతో జీవనం సాగించే ఎందరో సామాన్య, మధ్యతరగతి కుటుంబాకు జీవనోపాధి కల్పిస్తున్న ఆశ దీవు కూడా.దానవాయిపేట ప్రాంతంలో ఏడాది క్రితం ఓ వెర్రి ఎంకన్న..ఒక చిన్న రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. పచ్చని ఉద్యానవనం వంటి రెస్టారెంట్‌లో అనేక సంవత్సరాు సూపర్‌ వైజర్‌గానూ.. మేనేజర్‌గానూ.. పనిచేసిన ఇతగాడు తనకు బాగా తెలిసిన

హోటల్‌ వ్యాపారాన్నే తన జీవితానికి ఉపాథి మార్గంగా ఎంచుకున్నాడు. తాను ఎన్నో ఏళ్లుగా పనిచేసిన రెస్టారెంట్‌ను.. యజమాని మూసివేస్తే..దిగాు పడ్డాడు. తనకు బాగా తెలిసిన వృత్తినే.. వ్యాపారంగా చేసుకుని జీవితంలో స్థిరపడాని భావించాడు. మూత పడిన రెస్టారెంట్‌ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో కొంతభాగాన్ని మూడేళ్లకు లీజుకు తీసుకున్నాడు. అపార్టుమెంట్‌ ప్రెసిడెంట్‌,సెక్రటరీు మొదట్లో ఏవిధమైన అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం.. షాపు యజమాని సానుకూంగా ఉండటంతో సదరు వెంకీ బాబు ముందడుగు వేసాడు. తనతో పాటు మరో ఇద్దరు స్నేహితు భాగస్వామ్యంతో..సుమారు 15 క్ష రూపాయ మొత్తాన్ని.. 10రూపాయ వడ్డీకి అప్పు తీసుకువచ్చి మరీ ఈ చిన్న రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఆరు నెలు సజావుగానే నడిచింది. కొత్త వ్యాపారం కావడంతో.. లాభాు రాకపోయినా.. కరోనా పంజా విసిరినా.. నెమ్మదిగా నిదొక్కుకోవచ్చని భావించాడు. కానీ..వెంకీ బాబు..గోల్డెన్‌ ఆశపై స్థానికంగా ఉండే అధికార పార్టీ నాయకుడు నీళ్లు చల్లాడు.ఏమి జరిగిందో తెలియదు కానీ..అపార్ట్‌మెంట్‌ ప్రెసిడెంట్‌,సెక్రటరీు.. రివర్స్‌ టెండరింగ్‌ అన్నారు. రెస్టారెంట్‌ లీజుకు తీసుకున్న సమయంలో లేని..కనీసం గుర్తుకు రాని అభ్యంతాను..సిగ్గులేకుండా వల్లే వేస్తూ.. కార్పోరేషన్‌ అధికారుకు ఫిర్యాదు చేసారు. వెంకీ బాబు రెస్టారెంట్‌ వ్ల.. తమకు అనేక రకా ఇబ్బందు కుగుతున్నాయని..వెంటనే రెస్టారెంట్‌ను మూసి వేయాని గగ్గోు పెట్టారు. ఈ తతంగమంతా..సదరు అధికార పార్టీ నాయకుడి దిశానిర్ధేశంలో.. జరుగుతుందన్న విషయం పాపం..వెంకీ బాబుకు తెలియక.. ఆ నాయకుడికే మొర పెట్టుకున్నాడు. ఏడు కొండ వాడా..వెంకట రమణా! అంటే.. తనకే పాపం తెలీదు.. అంతా టౌన్‌ ప్లానింగ్‌ అధికారు చేతుల్లోనే ఉందంటూ సన్నాయి నొక్కు నొక్కాడు. ఈ మధ్యలో టౌన్‌ ప్లానింగ్‌లో ఓ అవినీతి రాజా.. రంగంలోకి దిగి.. రెస్టారెంట్‌కు సీల్‌ వేసేసాడు. దీంతో ఎంతో పకడ్భందీగా అల్లిన పథకం.. రసకందాయంలో పడిరది.మరి..టౌన్‌ ప్లానింగ్‌ అధికారును ఎలా ప్రసన్నం చేసుకోవాలి అంటే.. అదంతా చూసుకోవడానికి.. మీడియా ‘గుడా’రం ఉందని..ఏమాత్రం టెన్షన్‌ పడకుండా.. ఆ గుడారంలోకి రావాని.. ఆ నాయకుడి తనయుడు ఆహ్వానించాడు. రంగంలోకి మీడియా దిగుతుందని..ఏమి ఆందోళన చెందవద్దని…ధైర్యం చెప్పాడు.
రంగంలోకి..మీడియా బాబు
ఈ ఎపిసోడ్‌లో ప్రతిపక్ష టిడిపికి చెందిన నాయకుడి మీడియా ప్రతినిధిని..సదరు అధికార పార్టీ నాయకుడు తన తనయుడి ద్వారా రంగంలోకి దింపారు. ‘గుడా’రంలో అన్ని సెటిల్‌మెంట్లు..నోట్ల కట్టతో మూడో కంటికి తెలియకుండా చేయడంలో సిద్దహస్తుడని నాయకుడి కుమారుడు చెప్పిన మాటు రెస్టారెంట్‌ ఓనర్‌ వెంకీ బాబుకు నమ్మకాన్ని కల్గించాయి. అంతేకాదు.. టౌన్‌ ప్లానింగ్‌లో ఓ చేయితిరిగిన అవినీతి రాజుగారిని తమ గుడారంలోకి తీసుకువచ్చామని.. తాము చెప్పిన పెట్రోల్‌ బంకు వద్దకు ..తాము అడిగిన రెండు క్ష రూపాయు తీసుకుని వస్తే నీ సమస్య పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ ప్రారంభమవుతుందని చెప్పాడు. మొత్తం వ్యవహారమంతా.. టిడిపి నాయకుడి పత్రిక మీడియా బాబు చూసుకుంటారని హామీ ఇచ్చాడు. దీంతో రెస్టారెంట్‌ యజమాని వెంకీ బాబు.. అంత ఇచ్చు కోలేనని.. ఒక 50వే రూపాయు అయితే త తాకట్టు పెట్టి తీసుకువస్తానని విన్నవించుకున్నాడు. కానీ.. ఆ మొత్తానికి పని పూర్తికాదని.. అపార్టుమెంట్‌లో ఫిర్యాదుచేసిన వారిని కూర్చోబెట్టి.. అంతా సెటిల్‌ చేయాలి కదా! అంటూ అధికార పార్టీ నాయకుడి కుమారుడు చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారమంతా.. పూర్తిగా మీడియా బాబు చూసుకుంటారని అధికార పార్టీ నాయకుడి కుమారుడు గట్టిగా నొక్కి వక్కాణించాడు. అయితే వారు అడిగిన రెండు క్ష రూపాయు తీసుకురాలేక .. రెస్టారెంట్‌ యజమాని వెంకీ బాబు మానసిక క్షోభకు గురయ్యాడు. రెస్టారెంట్‌ మూతపడటంతో నిరాశలో మునిగి పోయాడు. తన వ్యాపారం మూత పడటంతో ఒక పక్క చేసిన అప్పు..మరో పక్క వడ్డీు పెరిగి ఆందోళనకు గురయ్యాడు.
కమిషనర్‌ గారూ.. దృష్టి సారిస్తారా?
ఈ సమాజంలో ఒక సామాన్య,మధ్యతరగతి వర్గానికి చెందిన వ్యక్తి.. ఏదైనా వ్యాపారం చేసుకుందామంటే అధికారంలో ఉన్న నాయకు చేతును తడపాలి. ఈ రకమైన దందా..రాజమండ్రిలోని దానవాయి పేట, ప్రకాశం నగర్‌,తిక్‌ రోడ్డు ప్రాంతాలోనే కాదు..నగరంలోని పు కీక వ్యాపార సముదాయాు ఎక్కువగా ఉన్న ప్రాంతాలో నిస్సిగ్గుగా సాగిపోతుంది. ఏ పార్టీ నాయకుడు.. అధికారంలో ఉంటే ఆ నాయకుడికి కప్పం కట్టాల్సిందే అన్న ప్రచారం సాగుతోంది. ఈ అవినీతికి పార్టీతో సంబంధం లేదు. ఏమాత్రం సిగ్గులేకుండా.. వాళ్లు వీళ్లు కలిసి పోతారు. దోపిడీలో వాటాను పంచుకుంటారు అన్న ఆరోపణు బంగా వినిపిస్తున్నాయి. ఇక రాజమండ్రి టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై భారీ ఎత్తున అవినీతి ఆరోపణు ఉన్నాయి. ఈ విభాగాన్ని నడిపించే కీక అధికారి.. పారదర్శకంగా ప్రజకు సేవందించడానికి చేస్తున్న ప్రయత్నాు.. కొందరు అవినీతి పరులైన కిందిస్థాయి అధికారు వ్ల నిర్వీర్యమవుతున్నాయి. ఈ రెస్టారెంట్‌ ఎపిసోడ్‌లో ఏకంగా గవర్నర్‌ పేరును సైతం.. దందా రాయుళ్లు వాడుకోవడం గమనార్హం. రాజమండ్రిలోని ఒక చిన్న రెస్టారెంట్‌ వ్యవహారంలో ఏకంగా గవర్నర్‌ గారు జోక్యం చేసుకున్నారని చెప్పడం.. సదరు నాయకుడు, అధికారి,మీడియా బాబుకే చెల్లింది. ఇటువంటి తప్పుడు వ్యవహారాపై.. ఐఏఎస్‌ అధికారి కూడా అయినా కమిషనర్‌ అభిషిక్తు కిషోర్‌ దృష్టి సారించాలి. కార్పోరేషన్‌లో కొందరు అవినీతి అధికారుపై కొరడా రaలిపించాలి. లేదంటే.. కమిషనర్‌గా తాను ఎంత నిజాయితీగా ప్రజకు సేవందించినా.. కొందరు ంచగొండులైన అధికారు వ్ల మొత్తం కార్పోరేషన్‌కే చెడ్డపేరు వస్తుందని నగర ప్రజు అభిప్రాయ పడుతున్నారు.

 

 

Comment here