Uncategorized

గురుకుల పాఠశాలలో విద్యార్ధులకు కరోనా టెస్టులు

గురుకుల పాఠశాలలో విద్యార్ధులకు కరోనా టెస్టులు
అమలాపురం
అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామంలో గల మహాత్మా జ్యోతిభాపూలే బిసి గురుకుల పాఠశాలలో  విద్యార్ధులందరికీ కరోనా టెస్టులు నిర్వహించడం జరిగింది. అనంతరం విద్యార్ధులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణాధికారి విపర్తి ప్రసాద్ మంచి ఆరోగ్యపు అలవాట్లపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైటియస్ రాజు, ఎన్. ప్రతాప్ కుమార్, సూదా మాచర జానకేశ్వరరావు, సుమలత, హెల్త్ సూపర్వైజర్ ముత్త లక్ష్మణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comment here