Uncategorized

పీడిత జన బాంధవుడు జ్యోతిరావు బాపూలే

కోస్తా ఎన్ కౌంటర్, రామచంద్రపురం;  పీడిత జన బాంధవుడు జ్యోతిరావు బాపూలే  జాతిపిత కన్నా ముందే మహాత్మునిగా పిలువబడ్డారు.   భారత రాజ్యాంగ రూపశిల్పి  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు గురువుగా ప్రసిద్ధిచెందిన జ్యోతిరావు పూలే మనదేశంలో ప్రప్రధమ సామాజిక తత్వవేత్త,కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలకు అండగా  ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా పోరాడిన ఘనత  ఆయనది. సత్య ధర్మ శోధక్  మండలిని స్థాపించి, సామాజిక సమస్యల పరిష్కారానికి  కృషి చేసిన యోధుడు పూలే అని నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు.  సత్యశోధక్ సమాజ్ వారోత్సవాల సందర్భంగా చివరి రోజున  దాక్షారామం మసీదు సెంటర్ లో ఉన్న పూలే దంపతుల విగ్రహాల వద్ద వక్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం    యాట్ల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని మరాఠా భాషనుండి తెలుగులో అనువాదం చేయించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో కట్టా సూర్య నారాయణ.కోటిపల్లి ఆబ్బు, ఎర్రంశెట్టి రామరాజు, టి. సత్యనారాయణ, పి సాంబ శివ రావ్, వి.రాంబాబు, డి. శంకర నారాయణ,  పి. బాబీ, డి. శంకరరావు, వీరు బండి, జి. వెంకటసోమరాజు, ఎం.శ్రీనివాస్, ఎస్వీ కాలేజ్ విద్యార్దులు పాల్గొన్నారు.

Comment here