Uncategorized

28న కర్నూలులో బహుజన చైతన్య వేదిక

28న కర్నూలులో బహుజన చైతన్య వేదిక
జయప్రదం చెయ్యాలని పిలుపు,
పల్లెపల్లెకి బిఎస్పీ కార్యక్రమానికి సన్నద్ధం -తూర్పుగోదావరి జిల్లా బి.ఎస్.పి పట్నాల విజయ కుమార్
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 26: ఈ నెల 28వ తేదీన కర్నూలులో బహుజన చైతన్య సభను నిర్వహిస్తున్నట్లుగా బిఎస్పీ తూర్పుగోదావరి జిల్లా ఇన్ చార్జి పట్నాల విజయ్ కుమార్ రాజమహేంద్రవరం స్థానిక ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఆయన తెలియజేసారు .ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల  28వ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు కర్నూలులోని ఎస్టీబిసి కళాశాల గ్రౌండ్ లో సభ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సభలో ముఖ్య అతిధిలుగా రాజ్యసభ సభ్యులు, బిఎస్పీ జాతీయ కో ఆర్డినేటర్ రామ్ జీ గౌతమ్,
బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బి. పరంజ్యోతిలు పాల్గొంటారని ఆయన తెలియచేశారు.మహాసభకి సంబంధించిన పోస్టర్‌ను స్థానిక
ప్రెస్ క్లబ్ లో  విలేకరుల సమక్షంలో ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలంలోనూ,కృష్ణా జిల్లా నందిగాం మండలంలోనూ ఒకో ఎం.పి
టి.సి స్థానాన్ని బిఎస్పీ గెలుచుకుందని, బిఎస్పీ రాష్ట్రంలో విజయాలకి ఇది
నాంది అని, వచ్చే అక్టోబరు, నవంబరు నెలల్లో పల్లెపల్లెకి బిఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, గ్రామస్థాయి నుంచి  పార్టీని పటిష్టం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఇంచార్జి పల్లి అబ్బులు, బిఎస్పీ నాయకులు ఇసుకపట్ల రాంబాబు, పల్లి రవి,కొత్తపల్లి శేఖర్,సోమబత్తుల సుబ్బారావు,మండా సుబ్రహ్మణ్యం తదితరులు
పాల్గొన్నారు.

Comment here